నా 'మనసు'న పరిపరి విధాల....'సాయి'నే తలచుకుంటూ ఉంటుంది
నా 'మది' వసారా యావత్తు.... 'సాయి' చిత్తరువులే పరచుకుని ఉంటాయి
నా 'మానస'మనే సరోవరంలో.... 'సాయి'నామం హంసగా విహరిస్తూ ఉంటుంది
నా 'ఎద' గదుల అలమరాలన్నీ....'సాయి'కృష్ణుని ప్రతిరూపాలే నిండి ఉంటాయి.
దృశ్యమానమవుతుంది నా ప్రతి శుభోదయంలో - అమ్మఒదికి సమానమైన 'ద్వారకామాయి' ప్రాంగణం
సదా రూపు కట్టి ఉంటుంది నా 'హృదయం'లో - షిరిదీలోని సమాధిమందిర 'సాయినాధుని' ప్రతిమారూపం
------'సాహితీ శశి' అంతరంగ 'సాయి' స్రవంతి----