ధన్యోస్మి బాబా ధన్యోస్మి
అపురూపమైన ఆధ్యాత్మిక వెలుగులు పంచిన ప్రేమమూర్తి నీవు
అత్యంత విలువైన భక్తి తత్వ సుధా మధురిమల వెల్లువయె నీవు
'శిరిడీ'ని అతి పవిత్రమైన పుణ్యధామంగా మలచిన మహాశిల్పి నీవు
ఈ విశ్వమంతటికి విశిష్ట సద్గురువుగా నిలిచిన విఖ్యాత విశేషమె నీవు
ఈ అఖండ భరత కర్మభూమిన శతకోటి వెలుగుల దివ్వె నీవు
ఈ ఆర్షధర్మభూమి-భారతభూమిన-గురువులలో సద్గురువు నీవు
శ్రద్ధ-సబూరిలనెడి జోడుగుర్రాలనెక్కిన రేడుగ ఖ్యాతికెక్కినావు
బలమైన భక్తితత్వ ప్రతీకాత్మక 'శరము'గ మాకు తోచినావు
ప్రేమ-సమానతల మేలిమి కలిమి నీవు
మేలైన తత్వసారం పంచిన యోగివీవు
యోగులలోకెల్ల రాజుగ నిన్నెంచినాము
మంచిమనసున్నమహరాజుగ కాంచినాము
--సాయితత్వ సుధారసధారల ధరిత్రి నింపిన శ్రీ షిరిడీబాబాకివే జోతలు--