Saturday 19 May 2012


మహిలో మహితాత్ముడు మన 'సాయి'.... 

మానసంలో గురుతుల్యులు షిరిడీ 'సాయి'


మానవతకు మరో ప్రతిరూపం, నమ్మకానికి నిలువెత్తు స్వరూపం 

శాంతిప్రేమలు హృదయంలో అణువణువూ నింపుకున్న దైవస్వరూపం

సాధారణ మనిషిగా అవతారమెత్తి అమృత సుధలు అవలీలగా పంచిన వైనం 

ఈ కలియుగంలో మనందరి కోసం మూర్తీభవించినదే  'సాయి' సద్గురు స్వరూపం 

మనలో ఒకరిగా, మంచి యోగిగా, భక్తివిశ్వాసాల మనుగడకు సరైన సమయంలో, వలసిన స్థాయిలో, విలువైన రీతిలో, ఊతమిచ్చి భారతీయ భక్తి తత్వాన్ని క్రొత్త పుంతలు త్రొక్కించిన మహనీయుడు, మన భారతీయ యోగి పుంగవుడే మన షిరిడీ  సాయినాధుడు.

మహత్తరమైన ప్రేమ తత్వంతో, మనోజ్ఞమైన సబూరి-శ్రద్ధలతో భక్తుల/శిష్యుల మానసాలను పావనం చేసేందుకు, ప్రేమైక పూర్వక జ్ఞాన సుధలను అపారంగా పంచిన / నేటికినీ పంచుతున్నఅద్భుతమైన వైనం, సమర్ధ సద్గురువుగా ఆ 'సాయి' నడయాడిన 'ద్వారకామాయి' నేపధ్యం... అపూర్వం... అనిర్వచనీయం... అజరామృతం... 

కర్మభూమి, సువర్ణభూమి , వేదభూమి, జ్ఞానభూమి గా కొనియాడబడుతున్న 'భారతావనిలో అవతరించిన పరమ పావన గురువు, దత్తావతారుడు, పరమోత్కృష్ట అవధూత శ్రీ షిరిడీ సాయి బాబా వారు' అన్నది సత్యం. విశ్వశాంతికై విరిసిన సౌగంధికా పుష్పం 'సాయి తత్వం' . ఇది అమృత సమానమన్నది ముమ్మాటికిని అనుభవపూర్వక నిజం.యావదాధ్యాత్మిక ప్రపంచానికి రారాజుగా, భక్తి విశ్వాసాలకు రేడుగా, యోగిరాజుగా, మహారాజుగా, వందనాలందుకుంటున్న మన 'బంగారి' సాయి బాబా వారికి 'సాయి' తత్వాక్షరా పూర్వక అభివందనం' ....సాహితీ శశి అంతరంగజనితమైన ఈ చిరు కవితా వ్యాసం బాబా పై గల అనురాగానికి 'ప్రతీక' ....నాకు బాబా పై గల అపారమైన భక్తి విశ్వాసాలకు ఒక 'మచ్చు తునక '


No comments:

Post a Comment