
Friday, 30 January 2015
Thursday, 28 August 2014
Friday, 20 December 2013
Saturday, 23 November 2013
ఈ గురువారం సాయం సంధ్యలో సమర్ధ సద్గురు వారికీ 'చిరు కవితా కానుక' ను ఫేస్ బుక్ సాక్షిగా అందిస్తున్న 'సాయి' సుమధుర క్షణాలకు వందనం.... షిరిడీ సాయి బాబా వారి భక్తులందరికీ అభి వందనం....సాహితీ శశి
నా బాబా నడయాడిన ప్రాంతమైన 'షిరిడి' స్థలి ....
శ్రద్ధ - సబూరి జంట సుగుణాలనెడి జీవ నదుల సంగమ స్థలి
నా బాబా 'సమాధి మందిర' పుణ్య స్థలి ....
అద్భుతమైన-అచిరమైన మానవత్వ తత్వ సారం నిండిన సాగర స్థలి
'సాహితీ శశి' అంతరంగ స్రవంతిగా - ప్రయత్నపూర్వకంగా...
ఆశువుగా జాలువారిన సాయితత్వ సుకవితా కాంతి ఇది ....
సాక్షాత్ 'మహారాజైన షిరిడి సాయీశుని సుధా మధురిమలనెడి వెలుగుల సిరి నిండిన సాక్షరతా క్రాంతి ఇది
ధన్యవాదాలతో ..... ఇవటూరి శివకుమార్ ఆరాధ్య, సీతాఫల్మండి, సికింద్రాబాద్.
Thursday, 7 November 2013
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
స్వీయానుభవమున సేద తీరిన వేళ....
ఆడబిడ్డను ఎత్తుకుని ఆనందించిన వేళ....
ఆ షిరిడి సాయి నాధుని ద్వాదశాక్షరికి ప్రతిగా వ్రాసుకున్న చిన్న 12 పంక్తుల కవిత బాబా వారికి చిరు 'గురు దక్షిణ'గా
(మా అమ్మాయి ఓజో పుట్టిన 3 వ రోజున (05-02-2012) మరొక 'శత వసంతాల బహుమతి' (హండ్రెడ్ ఇయర్స్ గిఫ్ట్) ని ఆ సాయి భగవానుని పరంగా అందుకున్న ఆనందంతో నా కలం నుండి అప్రయత్నంగా ఆవిష్కృతమైన సారస్వతం.... మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు సాయి భక్తులందరి కోసమై....."సాహితీ శశి'
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
నిరతముగ నిన్నే స్మరింతు అనుక్షణం
నిక్కముగ నిన్నే భజింతు ప్రతిక్షణం
నికరముగ నీవె రక్షకుడవు క్షణక్షణం
నిజముగ సర్వాంతర్యామి నీవు
సతతము నీ దృష్టికి తెచ్చెదను నా మంచి-చెడులను
సాయీ... నీపై అపార విశ్వాసమె ఆదిగా నీ సన్నుతి చేయుదును
సమ్మతమునన్దించెదవుగ - నీవు నా మది సంతసింప
సభక్తికముగ - నా సర్వస్వము నీ అధీనమే కదా!!
నెరనమ్మితిని సాయిరామా!!!! ద్వారక(మాయి)రామా
శరణన్నవారిని సేద తీర్చెదవు - నీ అభయముతో...
తరతరాలుగా తధ్యమిది - అనుభవైకవేద్యమిది
కచ్చితముగ చర్విత చర్వణమిది
సాయి భక్త రేణువుగా... అమృత సమానమైన అంతరంగ ప్రవాహమిది
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
నిరతముగ నిన్నే స్మరింతు అనుక్షణం
నిక్కముగ నిన్నే భజింతు ప్రతిక్షణం
నికరముగ నీవె రక్షకుడవు క్షణక్షణం
నిజముగ సర్వాంతర్యామి నీవు
సతతము నీ దృష్టికి తెచ్చెదను నా మంచి-చెడులను
సాయీ... నీపై అపార విశ్వాసమె ఆదిగా నీ సన్నుతి చేయుదును
సమ్మతమునన్దించెదవుగ - నీవు నా మది సంతసింప
సభక్తికముగ - నా సర్వస్వము నీ అధీనమే కదా!!
నెరనమ్మితిని సాయిరామా!!!! ద్వారక(మాయి)రామా
శరణన్నవారిని సేద తీర్చెదవు - నీ అభయముతో...
తరతరాలుగా తధ్యమిది - అనుభవైకవేద్యమిది
కచ్చితముగ చర్విత చర్వణమిది
సాయి భక్త రేణువుగా... అమృత సమానమైన అంతరంగ ప్రవాహమిది
Thursday, 26 September 2013
సాహితీ శశి(సాయి)అంతరంగ స్రవంతి
సాయి భజన పాట
ఈ గురువారం సాయంసంధ్యలో షిరిడీ సాయి బాబా వారి భక్తులందరికీ వందనములతో....చిన్న భజన పాట-పల్లవితో (గుర్తున్నంత వరకు...)
నందనందన యదుకుల భూషణ... రాధా రమణ-శుభ చరణా...
హే మధుసూదన సాయి కృష్ణా... కరుణను గనుమో పావనా...
హే జనార్ధనా! శ్రీ రమణా... శ్రీ షిరిడి సాయీ నారాయణా
నందనందన యదుకుల భూషణ... రాధా రమణ-శుభ చరణా...
సాహితీ శశి(సాయి)అంతరంగ స్రవంతి-బాబావారం సాయంసంధ్య - గం.7.20 ని.
Posted by ivatury sivakumar aradhya at 6:57 AM
Subscribe to:
Posts (Atom)