Thursday 7 November 2013

శ్రీ షిరిడి సాయి చింతనామృతం


శ్రీ షిరిడి సాయి చింతనామృతం


నిరతముగ  నిన్నే స్మరింతు అనుక్షణం 

నిక్కముగ నిన్నే భజింతు ప్రతిక్షణం

నికరముగ నీవె  రక్షకుడవు క్షణక్షణం 

నిజముగ  సర్వాంతర్యామి  నీవు


సతతము నీ దృష్టికి తెచ్చెదను నా మంచి-చెడులను 

సాయీ... నీపై అపార విశ్వాసమె  ఆదిగా నీ సన్నుతి చేయుదును

సమ్మతమునన్దించెదవుగ - నీవు నా మది సంతసింప 

సభక్తికముగ  - నా సర్వస్వము నీ అధీనమే కదా!!


నెరనమ్మితిని  సాయిరామా!!!! ద్వారక(మాయి)రామా   

శరణన్నవారిని సేద తీర్చెదవు  - నీ అభయముతో...

తరతరాలుగా తధ్యమిది  - అనుభవైకవేద్యమిది 

కచ్చితముగ చర్విత చర్వణమిది


సాయి  భక్త రేణువుగా... అమృత సమానమైన అంతరంగ ప్రవాహమిది                                 

No comments:

Post a Comment