Saturday, 15 December 2012

shiridi sai sadguruvulanu sannuthisthu...4 VAAKYAMULU SUMADHURAMULU

మరపు లేదు 'సాయి' అనుభూతులకు

మదింపు చేయలేము 'సాయి' తత్వ మధురిమలను

మణులు-మాణిక్యాలకన్నా విలువైనవి 'సాయి' సూత్రములు

మధురమైన నెలవులు 'సాయి' మందిరములు

Wednesday, 21 November 2012

HEART SOUNDS(MADI mantram) as in SAI-BABA(Lub-Dub)


మది  నిండా  షిరిడి సాయి
హృది నిండా సద్గురు సాయి
మానసంలో సింహభాగం సాయి ఆలోచనలే
అంతరంగ స్రవంతి యావత్తు బాబా సాలోచనలే
మనసు  గదుల నిండా సాయి బాబా వారి చిత్తరువులే
హృదయం సడి కూడా 'సాయి-బాబా సాయి-బాబా'
***********సాహితీ శశి అంతరంగం ************

Saturday, 19 May 2012


మహిలో మహితాత్ముడు మన 'సాయి'.... 

మానసంలో గురుతుల్యులు షిరిడీ 'సాయి'


మానవతకు మరో ప్రతిరూపం, నమ్మకానికి నిలువెత్తు స్వరూపం 

శాంతిప్రేమలు హృదయంలో అణువణువూ నింపుకున్న దైవస్వరూపం

సాధారణ మనిషిగా అవతారమెత్తి అమృత సుధలు అవలీలగా పంచిన వైనం 

ఈ కలియుగంలో మనందరి కోసం మూర్తీభవించినదే  'సాయి' సద్గురు స్వరూపం 

మనలో ఒకరిగా, మంచి యోగిగా, భక్తివిశ్వాసాల మనుగడకు సరైన సమయంలో, వలసిన స్థాయిలో, విలువైన రీతిలో, ఊతమిచ్చి భారతీయ భక్తి తత్వాన్ని క్రొత్త పుంతలు త్రొక్కించిన మహనీయుడు, మన భారతీయ యోగి పుంగవుడే మన షిరిడీ  సాయినాధుడు.

మహత్తరమైన ప్రేమ తత్వంతో, మనోజ్ఞమైన సబూరి-శ్రద్ధలతో భక్తుల/శిష్యుల మానసాలను పావనం చేసేందుకు, ప్రేమైక పూర్వక జ్ఞాన సుధలను అపారంగా పంచిన / నేటికినీ పంచుతున్నఅద్భుతమైన వైనం, సమర్ధ సద్గురువుగా ఆ 'సాయి' నడయాడిన 'ద్వారకామాయి' నేపధ్యం... అపూర్వం... అనిర్వచనీయం... అజరామృతం... 

కర్మభూమి, సువర్ణభూమి , వేదభూమి, జ్ఞానభూమి గా కొనియాడబడుతున్న 'భారతావనిలో అవతరించిన పరమ పావన గురువు, దత్తావతారుడు, పరమోత్కృష్ట అవధూత శ్రీ షిరిడీ సాయి బాబా వారు' అన్నది సత్యం. విశ్వశాంతికై విరిసిన సౌగంధికా పుష్పం 'సాయి తత్వం' . ఇది అమృత సమానమన్నది ముమ్మాటికిని అనుభవపూర్వక నిజం.యావదాధ్యాత్మిక ప్రపంచానికి రారాజుగా, భక్తి విశ్వాసాలకు రేడుగా, యోగిరాజుగా, మహారాజుగా, వందనాలందుకుంటున్న మన 'బంగారి' సాయి బాబా వారికి 'సాయి' తత్వాక్షరా పూర్వక అభివందనం' ....సాహితీ శశి అంతరంగజనితమైన ఈ చిరు కవితా వ్యాసం బాబా పై గల అనురాగానికి 'ప్రతీక' ....నాకు బాబా పై గల అపారమైన భక్తి విశ్వాసాలకు ఒక 'మచ్చు తునక '


Friday, 18 May 2012


నా మది మందిరంలో మరిన్ని సాయి మధురానుభూతులు 

అన్నీ ఇన్నీ కావు, లెక్కింపలేనన్ని షిరిడి సా-ఈశుని దివ్య స్మృతులు 

కొన్నింటినన్నా అక్షరీకరించాలని తాపత్రయపడిన సంగతులు 

సాయి తత్వామృత బిందువులు....సాయి భక్తులకవి శక్తి సమన్వితములు 

***************సాహితిశశి అంతరంగ జనితములు*********** 

PREPARED TODAY FOR  " B A N G A R I    M A A   S H I R I D I   S A I   B A B A"


మదురాతి మధురమైనది, సుమధురమైనది సాయినామము 

మధుర సుధలు చిలికి, వ్యధలు తీర్చునది సాయినామము 

మనోమయజగత్తును మధురభక్తితో నింపునదే సాయినామము 

సుమదురమైనది, సుమనోహరమైనది మన సాయినామము 

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

సాహితీశశి అంతరంగ మధనం - మధురపదబంధ ప్రయోగం

Wednesday, 16 May 2012



అమ్మ - అమృతం

   

అమ్మ బిడ్డ పైన సదా ప్రేమనే కురిపిస్తుంది....ద్వారకామాయి కూడా అంతే కదా ! !

జీవితంలో మార్పును తీవ్రంగా కోరుకునే వారెవరైనా, షిరిడీ బాబా వారిని సద్గురువుగా భావించి....అచ్చం అమ్మలాగా సంభావించి సదా ధ్యానిస్తే , సదా స్మరిస్తే,,,,,మనల మంచి కోసం బాబా తపిస్తాడు....ద్వారకామాయి పరితపిస్తుంది....ఇది నిజం, విలువైన నవవిధ భక్తి  ఫలిత నైజం. 

కన్నతల్లి ఎంతగా ప్రేమించి తరిస్తామో అంతటి స్థాయిలోనే ద్వారకామాయి అమ్మఒడిని నమ్మి చూడండి, అనుక్షణం ద్వారకామాయి కధలను స్మరణలో ఉంచుకోండి. ఫలితం  స్వయంగా చూస్తారు, స్వయానా అనుభవిస్తారు....ఇది ఖచ్చితం, సాయి తత్వమనేది అమృతం. 


సమస్త సన్మంగళాని భవంతు ....స్వస్తి .....సాహితీశశి అంతరంగం  

(Today i have just intimated from shiridi samadhi mandiram as, just my sister's whole family along with my father & mother having the blessings of 'SAMARDHA SADGURU SHIRIDI SAI BABA' )

ద్వారకమాయి మధురిమ


మధురిమలకు మధురిమ

జగమునకది సత్సుధామధురిమ

మధుర భక్తి కధాసుధల మధురిమ

జగత్తునకది సత్సంగ సుధామధురిమ

సర్వ శాంతి సుధలకు మధురమైన నెలవు కదా !

షిరిడి బాబా నడయాడిన ద్వారకమాయి కధ !!

Friday, 11 May 2012

మధురిమలకు మధురిమ
జగమునకది సత్సుధామధురిమ

మధుర భక్తి కధాసుధల మధురిమ
జగత్తునకది సత్సంగ సుధామధురిమ

సర్వ శాంతి సుధలకు మధురమైన నెలవు కదా !
షిరిడి బాబా నడయాడిన ద్వారకమాయి కధ !!





created instant poetry by SAHITHI SASI (IVATURY SIVAKUMAR ARADHYA)
ON 13.05.2012 4 PM ONWARDS....

Thursday, 29 March 2012


 సద్గురు శిరిడీ సాయిబాబావారి ధ్యాన శ్లోకం :
     ------ సాహితీశశి అంతరంగ మధనం ------

   సదా  నింబవృక్షస్య  మూలాధివాసాత్
   సుధాస్రావిణం తిక్తమప్య  ప్రియంతమ్
   తరుమ్ కల్పవృక్షాధికం  సాధయన్తమ్
   నమామీశ్వరం  సద్గురుం  సాయినాధమ్ !

    ****ఇవటూరి శివకుమార్ *ఆరాధ్య ****