Saturday, 23 November 2013
Thursday, 7 November 2013
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
స్వీయానుభవమున సేద తీరిన వేళ....
ఆడబిడ్డను ఎత్తుకుని ఆనందించిన వేళ....
ఆ షిరిడి సాయి నాధుని ద్వాదశాక్షరికి ప్రతిగా వ్రాసుకున్న చిన్న 12 పంక్తుల కవిత బాబా వారికి చిరు 'గురు దక్షిణ'గా
(మా అమ్మాయి ఓజో పుట్టిన 3 వ రోజున (05-02-2012) మరొక 'శత వసంతాల బహుమతి' (హండ్రెడ్ ఇయర్స్ గిఫ్ట్) ని ఆ సాయి భగవానుని పరంగా అందుకున్న ఆనందంతో నా కలం నుండి అప్రయత్నంగా ఆవిష్కృతమైన సారస్వతం.... మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు సాయి భక్తులందరి కోసమై....."సాహితీ శశి'
శ్రీ షిరిడి సాయి చింతనామృతం
నిరతముగ నిన్నే స్మరింతు అనుక్షణం
నిక్కముగ నిన్నే భజింతు ప్రతిక్షణం
నికరముగ నీవె రక్షకుడవు క్షణక్షణం
నిజముగ సర్వాంతర్యామి నీవు
సతతము నీ దృష్టికి తెచ్చెదను నా మంచి-చెడులను
సాయీ... నీపై అపార విశ్వాసమె ఆదిగా నీ సన్నుతి చేయుదును
సమ్మతమునన్దించెదవుగ - నీవు నా మది సంతసింప
సభక్తికముగ - నా సర్వస్వము నీ అధీనమే కదా!!
నెరనమ్మితిని సాయిరామా!!!! ద్వారక(మాయి)రామా
శరణన్నవారిని సేద తీర్చెదవు - నీ అభయముతో...
తరతరాలుగా తధ్యమిది - అనుభవైకవేద్యమిది
కచ్చితముగ చర్విత చర్వణమిది
సాయి భక్త రేణువుగా... అమృత సమానమైన అంతరంగ ప్రవాహమిది

Subscribe to:
Posts (Atom)