Tuesday, 2 July 2013

PRASINGS of BELOVED Shri Shiridi Sai Baba


ధన్యోస్మి బాబా ధన్యోస్మి 

అపురూపమైన ఆధ్యాత్మిక వెలుగులు పంచిన ప్రేమమూర్తి నీవు
అత్యంత విలువైన భక్తి తత్వ సుధా మధురిమల వెల్లువయె నీవు 
'శిరిడీ'ని అతి పవిత్రమైన పుణ్యధామంగా మలచిన మహాశిల్పి నీవు
ఈ విశ్వమంతటికి విశిష్ట సద్గురువుగా నిలిచిన విఖ్యాత విశేషమె నీవు

ఈ అఖండ భరత కర్మభూమిన శతకోటి వెలుగుల దివ్వె నీవు
ఈ ఆర్షధర్మభూమి-భారతభూమిన-గురువులలో సద్గురువు నీవు
శ్రద్ధ-సబూరిలనెడి జోడుగుర్రాలనెక్కిన రేడుగ ఖ్యాతికెక్కినావు
బలమైన భక్తితత్వ ప్రతీకాత్మక 'శరము'గ మాకు తోచినావు  

ప్రేమ-సమానతల మేలిమి కలిమి నీవు 
మేలైన తత్వసారం పంచిన యోగివీవు 
యోగులలోకెల్ల రాజుగ నిన్నెంచినాము
మంచిమనసున్నమహరాజుగ కాంచినాము 

--సాయితత్వ సుధారసధారల ధరిత్రి నింపిన శ్రీ షిరిడీబాబాకివే జోతలు--     
              

Thursday, 7 March 2013

anukshanam sai nama japam - anubhoothi madhuram


(At First We updated this Instant Sai LITERATURE in F/B....Next Copy Pasted to this/my blog)

ee guruvaram SAYAM sandhyabhi vandanamulaku thoduga....kavithaa needaga....sahithi sasi F/B Mitrulatho / Sai Bhakthulandaritho panchukuntunna mrudumadhuramaina naa hridaya bhavanalu.....Sai naadhuniki GURUVARM Kanukaga/Guru Dakshinaga....Thanks for Sharing this....

 

నా 'మనసు'న పరిపరి విధాల....'సాయి'నే తలచుకుంటూ ఉంటుంది

నా 'మది' వసారా యావత్తు.... 'సాయి' చిత్తరువులే పరచుకుని ఉంటాయి

నా 'మానస'మనే సరోవరంలో.... 'సాయి'నామం హంసగా విహరిస్తూ ఉంటుంది

నా 'ఎద' గదుల అలమరాలన్నీ....'సాయి'కృష్ణుని ప్రతిరూపాలే నిండి ఉంటాయి.

దృశ్యమానమవుతుంది నా ప్రతి శుభోదయంలో - అమ్మఒదికి సమానమైన 'ద్వారకామాయి' ప్రాంగణం

సదా రూపు కట్టి ఉంటుంది నా 'హృదయం'లో - షిరిదీలోని సమాధిమందిర 'సాయినాధుని' ప్రతిమారూపం


------'సాహితీ శశి' అంతరంగ 'సాయి' స్రవంతి----

Like ·  ·  · Promote · 2 minutes ago · 

Saturday, 15 December 2012

shiridi sai sadguruvulanu sannuthisthu...4 VAAKYAMULU SUMADHURAMULU

మరపు లేదు 'సాయి' అనుభూతులకు

మదింపు చేయలేము 'సాయి' తత్వ మధురిమలను

మణులు-మాణిక్యాలకన్నా విలువైనవి 'సాయి' సూత్రములు

మధురమైన నెలవులు 'సాయి' మందిరములు

Wednesday, 21 November 2012

HEART SOUNDS(MADI mantram) as in SAI-BABA(Lub-Dub)


మది  నిండా  షిరిడి సాయి
హృది నిండా సద్గురు సాయి
మానసంలో సింహభాగం సాయి ఆలోచనలే
అంతరంగ స్రవంతి యావత్తు బాబా సాలోచనలే
మనసు  గదుల నిండా సాయి బాబా వారి చిత్తరువులే
హృదయం సడి కూడా 'సాయి-బాబా సాయి-బాబా'
***********సాహితీ శశి అంతరంగం ************

Saturday, 19 May 2012


మహిలో మహితాత్ముడు మన 'సాయి'.... 

మానసంలో గురుతుల్యులు షిరిడీ 'సాయి'


మానవతకు మరో ప్రతిరూపం, నమ్మకానికి నిలువెత్తు స్వరూపం 

శాంతిప్రేమలు హృదయంలో అణువణువూ నింపుకున్న దైవస్వరూపం

సాధారణ మనిషిగా అవతారమెత్తి అమృత సుధలు అవలీలగా పంచిన వైనం 

ఈ కలియుగంలో మనందరి కోసం మూర్తీభవించినదే  'సాయి' సద్గురు స్వరూపం 

మనలో ఒకరిగా, మంచి యోగిగా, భక్తివిశ్వాసాల మనుగడకు సరైన సమయంలో, వలసిన స్థాయిలో, విలువైన రీతిలో, ఊతమిచ్చి భారతీయ భక్తి తత్వాన్ని క్రొత్త పుంతలు త్రొక్కించిన మహనీయుడు, మన భారతీయ యోగి పుంగవుడే మన షిరిడీ  సాయినాధుడు.

మహత్తరమైన ప్రేమ తత్వంతో, మనోజ్ఞమైన సబూరి-శ్రద్ధలతో భక్తుల/శిష్యుల మానసాలను పావనం చేసేందుకు, ప్రేమైక పూర్వక జ్ఞాన సుధలను అపారంగా పంచిన / నేటికినీ పంచుతున్నఅద్భుతమైన వైనం, సమర్ధ సద్గురువుగా ఆ 'సాయి' నడయాడిన 'ద్వారకామాయి' నేపధ్యం... అపూర్వం... అనిర్వచనీయం... అజరామృతం... 

కర్మభూమి, సువర్ణభూమి , వేదభూమి, జ్ఞానభూమి గా కొనియాడబడుతున్న 'భారతావనిలో అవతరించిన పరమ పావన గురువు, దత్తావతారుడు, పరమోత్కృష్ట అవధూత శ్రీ షిరిడీ సాయి బాబా వారు' అన్నది సత్యం. విశ్వశాంతికై విరిసిన సౌగంధికా పుష్పం 'సాయి తత్వం' . ఇది అమృత సమానమన్నది ముమ్మాటికిని అనుభవపూర్వక నిజం.యావదాధ్యాత్మిక ప్రపంచానికి రారాజుగా, భక్తి విశ్వాసాలకు రేడుగా, యోగిరాజుగా, మహారాజుగా, వందనాలందుకుంటున్న మన 'బంగారి' సాయి బాబా వారికి 'సాయి' తత్వాక్షరా పూర్వక అభివందనం' ....సాహితీ శశి అంతరంగజనితమైన ఈ చిరు కవితా వ్యాసం బాబా పై గల అనురాగానికి 'ప్రతీక' ....నాకు బాబా పై గల అపారమైన భక్తి విశ్వాసాలకు ఒక 'మచ్చు తునక '


Friday, 18 May 2012


నా మది మందిరంలో మరిన్ని సాయి మధురానుభూతులు 

అన్నీ ఇన్నీ కావు, లెక్కింపలేనన్ని షిరిడి సా-ఈశుని దివ్య స్మృతులు 

కొన్నింటినన్నా అక్షరీకరించాలని తాపత్రయపడిన సంగతులు 

సాయి తత్వామృత బిందువులు....సాయి భక్తులకవి శక్తి సమన్వితములు 

***************సాహితిశశి అంతరంగ జనితములు*********** 

PREPARED TODAY FOR  " B A N G A R I    M A A   S H I R I D I   S A I   B A B A"